calender_icon.png 19 May, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూన్‌లో ఫణి

19-05-2025 01:06:02 AM

డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న గ్లోబల్ మూవీ ‘ఫణి’. ఈ థ్రిల్లర్ సినిమాను ఓఎంజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డాక్టర్ మీనాక్షి అనిపిండి ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాష ల్లో నిర్మిస్తున్నారు.

ఆమే మ్యూజిక్ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తు న్నారు. ఒక నల్ల పాము (బ్లాక్ పైన్) ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ విజువల్ వండర్ మూవీలో కేథరిన్ ట్రెసా, మహేశ్ శ్రీరామ్, నేహాకృష్ణ, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఆదివారం నిర్మాత మీనాక్షి పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ సినిమా రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. జూన్ నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.