calender_icon.png 31 December, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూగరోదన వినిపించదా?

31-12-2025 01:15:04 AM

అదే తీరు.. అదేజోరు

రామయ్య సన్నిధిలో అధికారులు, భద్రత పరిరక్షణలో పోలీసులు  

మూగజీవాల తరలింపులో ఆవ్యాపారి మార్క్

యథేచ్చగా గోవుల అక్రమ రవాణా, కలసి వచ్చిన అవకాశం 

తరిగిపోతున్న పశు సంపద, కబేళాలకు మూగజీవాలు

గుట్టుచప్పుడుకాకుండా కంటెయినర్లలో తరలింపు

మణుగూరు,డిసెంబర్ 30 (విజయక్రాంతి): పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండల కేంద్రంగా పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పశువుల తరలింపే ఆదాయ వనరులుగా మా ర్చుకుని కొందరు అక్రమార్కులు రెచ్చి పో తున్నారు. దీని వెనుక ప్రధాన పార్టీ అని చె ప్పుకుంటున్న ఓ నేత ఉండటం గమనార్హం. రోజువారీగా హైదరాబాద్ కేంద్రంగా వేలాది పశువులు తరలిపోతున్నఅధికారులలో మా త్రం చలనం కనిపించడం లేదు. మూగజీవాల రోదన ఎవరికి వినిపించడం లేదనే వాదన మండల వ్యాప్తంగా వినిపిస్తుంది. అ యినా వ్యాపారి అక్రమ మార్గాన్ని అడుకునేందుకు ఏ ఒక్క అధికారి ముందుకు కద లలేని పరిస్థితి నెలకొంది. మూగజీవాల అర ణ్య ఘోస ఫై విజయక్రాంతి అందిస్తున్న ప్రత్యేక కథనం...

అదే తీరు.. అదేజోరు..

చీకటిలో మూగ జీవాలను రవాణా చేస్తూ సోమ్ము చేసుకుంటున్న మాఫియా తమ వ్యాపార రవాణా విధానాన్ని ఏవరీకి అనుమానం రాకుండా రోజుకో విధంగా మారుస్తున్నారు. గతంలో మూగజీవాల ను డీసీఏం, అశోక్ లీల్యాండ్(ట్రాలీ) వం టి వాహనాలలో రాత్రి సమయంలో గుట్టుగా తరలించేవారు. గత కొంత కాలంగా ఆ వ్యా పారి తన చీకటి మాఫియా రవాణా విధానాన్ని డీసీఏం లోంచి కంటైనర్లోకి మార్చుకు న్నారు. రెండు డీసీఏంలో వెళ్లె మూగజీవాల లోడ్ ఒక కంటైనర్లో వెలుతుండడంతో కంటైనర్లో మూగజీవాల ను తరలించే సమయం లో ఏవరికీ అనుమానం రాకుండా కంటైనర్ వెనుక గల డోర్లకు సీల్ వేసి రాత్రి పగలు అనే తేడా లేకుండా గుట్టు చప్పుడు కాకుం డా తరలి స్తున్నారు. 

అదే తీరు.. అదేజోరుగా 

పట్టణం నడిబొడ్డు కేంద్రంగా పశు రవా ణా దందా కొనసాగటం ఫై జంతు ప్రేమీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రామయ్య సన్నిధిలో అధికారులు, భద్రత పరిరక్షణలో పోలీసులు

మూగజీవాల తరలింపులో ఆ వ్యాపారి మార్క్ కనబరుస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం సబ్ డివిజన్ పోలీసులు భద్రాచలంలో భక్తుల భద్రతను పర్యవేక్షిస్తుండగా, అధికారులు తమకు కేటాయించిన విధులలో బిజీగా ఉన్నారు. ఇదే అ వకాశం అనుకూలంగా భావించిన ఆ వ్యా పారి మూగజీవాలను దళారుల సాయంతో తరలించారు. రూ. లక్షలు వెనకేసుకుంనేందుకు. తన మార్కును చూపిస్తూ నిబంధనల కు విరుద్ధంగా అక్రమ రవాణా చేస్తూ రాత్రికిరాత్రే సరిహద్దులు దాటించేస్తున్నారు. దారి పొడవున కనిపించిన అధికారుల చేతులు త డుపుతూ తమ దారికి అడ్డు రాకుండా వ్యా పారి మార్గం సుగమం చేసుకుంటున్నారు.

మండల కేంద్రంలో పేరు మోసిన బడావ్యాపారి మూగజీవాలను కబేళాలకు తరలిస్తు కొంత మందితో కలసి చీకటి మాఫియాగా ఏర్పడి రాత్రికి రాత్రే లక్షల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. నామా మాత్రాపు తనీఖీలకు అలవాటు పడిన చీకటి మాఫియా అదును చూసి మూగజీవాలను ప్రదాన చెక్ పోస్ట్ ద్వారా హైదరాబాద్ కబేలాలకు దాటిస్తూ లక్షల రూపాయాలు అర్జీస్తున్నారు. సంవత్స రం తిరగని లేగ దూడల నుండి పెద్ద మూగ జీవాల వరకు వీరి అక్రమా కబేళా వ్యాపారానికి బలైవుతూ వీరి బ్యాంక్ అకౌంట్లోకి న గదుగా జమ అవుతున్నాయి.

గోదావరి రేవు నుండి తరలింపు..

చర్ల, చత్తీస్ఘడ్ సరిహద్దు ప్రాంతాల నుండి మూగజీవాలను కొనుగోలు చేసి గోదావరి అవతల నుండి మణుగూరు మల్లేపల్లి రేవు కు తరలించి, నేరెళ్ల చెరువును, మల్లెపల్లి పా ర్కు ప్రధాన స్థావరా లుగా మనసుకున్న అ క్రమార్కులు, రోజు రాత్రులు మూగజీవాల అక్రమా రవాణా కోనసాగిస్తున్నారు. రోజు పగలు, రాత్రి అనే తేడా లేకుండా అశోక్ లి ల్యాండ్ ట్రాలీ, డీసీఏం, కంటైనర్ వంటి వా హనాలలో పరిమితి మించి ట్రాలీలలో అ యితే 13,నుండి15, డీసీఏంలో 30నుండి 40, కంటైనర్లో 60 నుండి 100 వరకు మూ గ జీవాలను జంతు రవాణా చట్టం అతి క్ర మించి తలిస్తున్నారు.

నిబందనలకు విరుద్దంగా మూగజీవాలను తరలిస్తున్న వాహ నాలను ఏవరి కంట పడకుండా గమ్యస్థానాలకు త్వరగ చేర్చే క్రమంలో వాహనాలను 100 కీమీ అతి వేగంతో డ్రైవర్లు నడుపుతున్నారు ఈ క్రమంలో అతి వేగం కారణంగా రోడ్డు ప్రమా దాలు (అక్సీడెంట్స్) జరిగిని సందర్బాలు ఉన్నా యి. ఇంతలా నిత్యం ఈ అక్రమా రవాణా వ్యాపారం కోనసాగుతున్న అధికారులు కనీసం తనీఖీలు నిర్వహించకపోవడమే కారణం అనీ ప్రజల నుండి విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ అక్రమ రవా ణా పై దృష్టి సారించి సదరు సంబందిత శాఖ అదికారులు ప్రదాన చెక్పోస్టులను ఏ ర్పా టు చేసి వాహనా తనీఖీలు కోనసాగిం చి నట్లయితై మూగజీవాల రవాణాను కట్టడి చేయవచ్చు అనీ ప్రజలు అశా భావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పం దించి అక్రమ మూగజీవాల రవాణానను అడ్డుకోవాలని, గో పరిరక్షణ సమితి నాయకులు, హైందవ సంఘాల నేతలు కోరుతున్నారు.