24-10-2025 12:00:00 AM
హైదరాబాద్‌లో ముగిసిన అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి): గ్లోబల్ ఈవెంట్స్ ఆఫ్ పయనీరింగ్ అండ్ అడ్వాన్సింగ్ క్వెస్ట్స్ (జియోపాక్) చెక్ ఏరోస్పేస్ క్లస్టర్ సహకారంతో నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్ కాన్ఫరెన్స్ బయోఇన్‌స్పైర్ ఫ్రాంటియర్స్-2025: స్పేస్ ఎకానమీ, బయోమిమిక్రీ, ఎక్స్‌ట్రాక్ట్‌టెర్రెస్ట్రియల్ రిసోర్సెస్ గురువారం హైదరా బాద్‌లోని జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో విజయవంతంగా ముగిసింది.
అంతరిక్ష అన్వేషణ, వనరుల నిర్వహణ కోసం ప్రకృతి మేధస్సు స్థిరమైన వ్యూహాలను ఎలా తెలియజేయగలదో అన్వేషించడానికి ఈ కార్యక్రమం ప్రపంచ నిపుణులు, ఆవిష్కర్తలు, విధాన నిర్ణేతలు, విద్యార్థులను ఒకచోట చేర్చింది. ఈ సమావేశాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఆయన తెలంగాణలో డీప్‌టెక్ వెంచర్లకు సహాయకనియం త్రణ వాతావరణం, ఇంక్యుబేషన్ మద్దతు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడానికి ప్రభుత్వం కట్టుబ డి ఉందని తెలిపారు.
జియోపాక్ వ్యవస్థాపకుడు, సీఈ ఓ ముర్తుజా అబ్బాస్‌ఖురాసాని మాట్లాడుతూ.. ‘ప్రపంచశాస్త్రీయ సమాజం, అంత రిక్ష నిపుణులు, విద్యావేత్తలు, వ్యవస్థాపకులు, విద్యార్థుల అద్భుతమైన స్పందనతో ఉప్పొంగిపోయాం. హైదరాబాద్ బలమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ పర్యావరణ వ్యవస్థ. దీంతో శాశ్వత వేదికగా మేము ఈ నగరాన్ని ఎంచుకున్నాం. చురుకైన భాగస్వామ్యం, ఆవిష్కరణ, సహకారాన్ని పెంపొందించడానికి ఇదొక ఆదర్శకేంద్రంగా మారింది” అన్నారు. తదుపరి సమావేశం హైదరాబాద్‌లో, చెక్ రిపబ్లిక్, యూరప్‌లో ఏకకాలంలో నిర్వహించబడుతుందన్నారు.