24-10-2025 12:00:00 AM
సదాశివపేట, అక్టోబర్ 23 : సదాశివపేట పట్టణంలోని లిటిల్ బరడ్స్ హై స్కూల్ లో చదువుతున్న 20 మంది పిల్లలకు తృటిలో పెను ప్రమాదం తప్పింది, వివరాల్లోకెళ్తే.. గురువారం ఉదయం లిటిల్ బరడ్స్ హై స్కూల్ బస్సు రేజింతల్ నుండి కంబాలపల్లి మార్గ మధ్యలో 20 మంది స్కూల్ పిల్లలను తీసుకొని వెళ్తుండగా ముందు నుండి కార్ రావడంతో దానికి సైడ్ ఇద్దామనే ఉద్దేశంతో బస్సుని రోడ్డు దించడంతో ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్ళింది. వెంటనే డ్రైవర్ బస్సును నిలిపివేశాడు.
బస్సులో ఉన్న పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని బస్సు డ్రైవర్ చెప్పారు. బస్సు ఫిట్నెస్ లేకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.