11-08-2025 01:08:04 AM
నాగర్ కర్నూల్ ఆగస్టు 10 (విజయక్రాంతి) 2025 పాలసీ సంవత్సరానికి గాను రైతు భీమా పథకానికి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం విడుదల చేసిందని, జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 5 వరకు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొం దిన రైతులు, ఇంతవరకు రైతు భీమా చేసుకోని రైతులు మాత్రమే నమోదు చేసు కోవాలన్నారు.
ఈ పథకానికి 1966 ఆగస్టు 14 నుండి 2007 ఆగస్టు 14 మధ్య జన్మించిన రైతులు మాత్రమే అర్హులుగా ఉంటారని గతంలో భీమా చేసుకున్న రైతులు మళ్లీ న మోదు చేసుకోవాల్సిన అవసరం లేదన్నా రు. కొత్తగా నమోదు చేసుకునే రైతులు తమ మండల వ్యవసాయ అధికారి, ఏఈఓ వద్ద పట్టా పాస్ పుస్తకం, రైతు ఆధార్, నామినీ ఆధార్ జిరాక్స్ కాపీలను జత చేసి ఇవ్వాలన్నారు.
జిల్లాలో కొత్తగా 12,613 మంది రైతులు గుర్తించబడినట్లు తెలిపారు. వీరిలో అర్హులైన ప్రతి రైతు ఆగస్టు 13 లోపు రైతు భీమా పథకానికి నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.