13-05-2025 04:56:20 PM
చిలుకూరు: చిలుకూరు మండలం సీతారాంపురంలో విద్యుదాఘాతంతో మూడు గేదెలు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గన్నా వెంకటేశ్వర్లు, గన్నా సత్యనారాయణ, ముత్తయ్యలకు చెందిన గేదెలు మేత కోసం మంగళవారం ఉదయం వదిలిపెట్టగా, సీతారామపురం సమీపంలోని సబ్బుల ఫ్యాక్టరీ వెనుక విద్యుదాఘాతంతో మూడు గేదెలు మృతి చెందాయని తెలిపారు. వాటి విలువ సుమారు రెండు లక్షలు ఉంటాయని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.