calender_icon.png 3 July, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

03-07-2025 04:42:50 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): సార్వత్రిక సమ్మె(General Strike)ను సకలజనులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ(CPI) నాయకులు చిప్ప నరసయ్య, ఆడెపు రాజమౌళి పిలుపునిచ్చారు. బెల్లంపల్లి సీసీఐ కార్యాలయంలో గురువారం పట్టణ కార్యవర్గ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి పాల్గొని మాట్లాడారు. ఈనెల జూలై 9 తారీఖున కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను కాలరాస్తూ బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తూ వాళ్ల మెప్పు పొందడానికి 44 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు కోడ్ లను తీసుకొచ్చి కార్మిక, కార్మిక కుటుంబాలలో అశాంతిని సృష్టించిందని విమర్శించారు.

అందుకు వ్యతిరేకంగా భారతదేశంలోని అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు జులై 9న జరిగే సమ్మెలో భాగస్వాములై సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. నాలుగు కోడ్ లని ఉపసంహరించుకొనీ  44 కార్మిక చట్టాలనే కొనసాగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, పట్టణ కార్యవర్గ సభ్యులు రత్నం రాజం, బొంకూరీ రామచందర్, శనిగారపు రాజేందర్, నాయకులు ఇనుముల రాజమల్లు, గుండా శంకరయ్య పాల్గొన్నారు.