03-07-2025 09:56:26 PM
మంథని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల సునీల్ రెడ్డి..
కమాన్ పూర్ (విజయక్రాంతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పాగా వేస్తామని పెద్దపెల్లి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు, మంథని నియోజకవర్గ ఇన్చార్జి చంద్రుపట్ల సునీల్ రెడ్డి(Constituency In-charge Chandrupatla Sunil Reddy) అన్నారు. గురువారం కమాన్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివార స్వామి ఆలయ ప్రాంగణంలో మండల శాఖ అధ్యక్షుడు కొయ్యడ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ సమావేశాన్ని నిర్వహించి నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవలే నూతనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్ర రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ పూర్తిస్థాయిలో గెలిచేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సునీల్ రెడ్డి అన్నారు. గ్రామ గ్రామాన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను మోడీ చేస్తున్న ప్రజా ఉపయోగకరమైన పథకాలను ప్రజలకు వివరించే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మత్స్యగిరి రాము, మట్ట శంకర్, జంగేపల్లి అజయ్, మల్లారపు అరుణ్, జంగేపల్లి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.