calender_icon.png 4 July, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి నీళ్లు రాక ఖాళీ బిందెలతో మహిళల నిరసన

03-07-2025 09:56:13 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత పది రోజుల నుండి మంచి నీళ్ల రాక ఇబ్బందులు పడుతున్నారని కాలనీ మహిళలు, యువకులు గురువారం కాలి బిందెలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ... గత పది రోజులుగా నీళ్లు రాకపోవడంతో ఆటోలు టాటా ఏసీలలో బోరు నుండి నీళ్లు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని నెలల నుండి ఇదే సమస్య ఉన్న అధికారులు శాశ్వత పరిష్కారం చేయడం లేదని మండిపడుతున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, బోర్ కాలిపోయిందని ఇలా సాకులు చెపుతూ కాలం గడుపుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిరసనకారులు బొంకురి వీర సోవమ్మ , బొంకురి సునీత, బొంకురి వెంకటమ్మ, ఆకారం ముత్తమ్మ, తడకమల్ల నరసమ్మ, బాలమ్మ, వెంకటమ్మ, బేబీ, వనిత మధు, సురేష్, మనోహర్, సన్నీ, గోపి, ప్రభు, బన్నీ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.