03-07-2025 04:45:48 PM
నిరుద్యోగ సమస్యల పరిష్కారానికై జూలై 4వ తేదీన చలో సెక్రటరియేట్..
కట్ట లింగస్వామి డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి..
మునుగోడు (విజయక్రాంతి): యూత్ డిక్లరేషన్ హామీలను అన్నిటినీ అమలు చేసేందుకు జూలై 4వ తేదీన చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి(DYFI District Assistant Secretary Katta Lingaswamy) పిలుపునిచ్చారు. స్థానిక మండల కేంద్రములో మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ను అమలు చేసి ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇవ్వాలని, గత ప్రభుత్వం నోటిఫికేషన్ పేరుతోటి 55 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని, ఇంకా 1,45,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పును ఈ ప్రభుత్వం కూడా చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జూలై 4న సెక్రటేరియట్ ముట్టడిని నిరుద్యోగ యువత అధిక సంఖ్యల హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మిర్యాల భరత్, మండల అధ్యక్ష కార్యదర్శులు బొడ్డుపల్లి నరేష్, యాసరాని వంశీకృష్ణ, మండల ఉపాధ్యక్షులు యాట శ్రీకాంత్, యాదయ్య ఉన్నారు.