03-07-2025 09:56:34 PM
మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలోని బోయినిపేట ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం బోయినిపేట లక్ష్మీ దేవి ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ముదిరాజ్ సంఘం కుల పెద్దలుగా అట్టెం రాజు, సుంకరి జగదీశ్వర్, పోతరవేణి నడిపి రాజులను ఎన్నుకున్నారు. అకౌంటెంట్ గా రాచకొండ రాజేందర్ రికార్డు అసిస్టెంట్ గా జడిగల రాములను నియమించారు. నూతనంగా ఎన్నికైన వారిని సభ్యులు ఘనంగా శాలువాలతో సన్మానించి అభినందించారు. ముదిరాజ్ సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన కమిటీ నాయకులు హామీ ఇచ్చారు.