03-07-2025 10:25:33 PM
ఎంపీడీవోకు వినతి పత్రం అందించిన మంగపేట బీజేపీ నాయకులు..
మంగపేట (విజయక్రాంతి): మంగపేట బీజేపీ బూత్ అధ్యక్షులు ఎడ్లపల్లి సాయిరాం ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలపై మండల ఎంపీడీఓని కలిసి గ్రామాలలో నెలకొన్న సమస్యలపై వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎంపీడీవో బద్రు నాయక్(MPDO Badru Naik) సమస్యలపై సానుకూలంగా స్పందించడం జరిగిందని సాయిరాం తెలిపారు. వినతి పత్రంలో పేర్కొన్న సమస్యలపై త్వరితగతిన చర్యలు తీసుకుంటానని స్థానిక ఎంపీడీవో హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎండి యాకూబ్ పాషా ,జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ చల్లా రాంకీ మాజీ మండల అధ్యక్షులు పల్నాటి సతీష్ మండల ప్రధాన కార్యదర్శి బోల్లికొండ సాంబయ్య, బలగాని కొమరయ్య ,కర్రి శ్రీనివాస్ మండల సోషల్ మీడియా ఇన్చార్జి యంబటి నవీన్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి కటుకోజు ప్రశాంత్, గోమాస సావిత్రి తదితరులు పాల్గొన్నారు.