calender_icon.png 3 July, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మెకానిక్ డే వేడుకలు

03-07-2025 04:40:06 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ మెకానిక్ డే(World Mechanic Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో గురువారం నిర్వహించిన వేడుకల్లో ప్రపంచ మెకానిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని యూనియన్ పట్టణ అధ్యక్షులు చిరుత మల్లేష్ యూనియన్ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి సంవత్సరం జూలై 3న మెకానిక్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామనీ అన్నారు.

వాహనాలు, యంత్రాలు ఇతర సాంకేతిక పరికరాలను సరి చేయడం, నిర్వహించడంలో నైపుణ్యం కలిగిన మెకానిక్ ల కృషిని మరువలేమన్నారు. వాహనాలు, యంత్రాల మరమ్మత్తులు చేయడంలో మెకానిక్ ల కృషిని అభినందించేందుకే మెకానిక్ డే వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు ఎర్రోజు బ్రహ్మం, ప్రధాన కార్యదర్శి ముత్యంపల్లి భాస్కర్, మర్రి రాము, మెరుగు కిషన్, కస్తూరి సత్యం,కుమార్, ఓ శ్రీనివాస్, తుమ్మల శ్రీనివాస్, సురేష్, మున్నా, ఓదెలు, శ్రీను, జగదీష్, శంకర్ లు పాల్గొన్నారు.