21-05-2025 11:45:35 PM
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..
ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు అధైర్య పడద్దని, కల్లాల్లో ఉన్న తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్(MLA Vedma Bhojju Patel) అన్నారు. మేరకు బుధవారం సాయంకాలం ఖానాపూర్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఎవరు కూడా అధైర్య పడద్దని, ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్, జన్నారం, మండలాల్లో వరి రైతులు నష్టపోయిన పరిస్థితి తమ దృష్టికి వచ్చిందని, ఆ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు తగు నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే వాట్సాప్ మెసేజ్ ల ద్వారా రైతులకు భరోసా కల్పించారు.