26-11-2025 12:32:12 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, నవంబరు 25 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మంగళవారం గంగాధర మండల కేంద్రంలోని రైతు వేదికలో చొప్పదండి నియోజకవర్గం లోని ఆరు మండలాలకు చెందిన 4916 స్వశక్తి సంఘాల మహిళలకు 4.76 కోట్ల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలే కేంద్రంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహజ్యోతి తో 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండర్ అందజేస్తున్నట్లు తెలిపారు. మహిళలు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకొని గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, మండల పార్టీ అధ్యక్షుడు పురుమళ్ళ మనోహర్, నాయకులు దుబ్బాసి బుచ్చయ్య, గంగాధర ప్రవీణ్, తదితరులుపాల్గొన్నారు.