calender_icon.png 11 January, 2026 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులందరికీ 1.02 కోట్ల ప్రమాద బీమా

10-01-2026 01:49:37 AM

  1. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట
  2. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 

హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శుక్రవారం సాయం త్రం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్ర జాప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ చేర్చే ప్రభు త్వ ఉద్యోగులు ‘మా కుటుంబ సభ్యులుగా’ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం భావిస్తోందని వివరించారు.

1.02 కోట్ల ప్రమాద బీమాకు సంబంధించిన ప్రక్రియను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రం లోని ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిసినట్టు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్ని ఆర్థిక ఇ బ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం ప్రతి నెలా క్రమం తప్పకుండా దశలవారీగా విడుదల చేస్తూ వస్తున్నామని వివరించారు.

ఉద్యోగులకు ప్రమాద బీమాకు సంబంధించి ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో పరిధిలోని ఉద్యోగులందరికీ కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు డిప్యూటీ సీఎం తెలి పారు. ఇదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం 1.02 కోట్ల ప్రమాద బీమాను అమల్లోకి తీసుకు వస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 5.14 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని డిప్యూ టీ సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలోని రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు.