22-11-2025 12:00:00 AM
ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్
దేవరకొండ, నవంబర్ 21, (విజయక్రాంతి): కొండ మల్లెపల్లి మండలం గాజీనగర్ తండాలో 3 కోట్లు 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యవసాయ రంగం సుస్థిరంగా అభివృద్ధి చెందేందుకు స్థిరమైన విద్యుత్ సరఫరా అత్యంత కీలకం అని, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
గాజీనగర్ ప్రాంతంలో ఉన్న లో వోల్టేజ్ సమస్యను పూర్తిగా నివారించి, రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడం తమ ప్రథమ కర్తవ్యమని తెలిపారు.ఒక సంవత్సరంలో దేవరకొండ నియోజకవర్గానికి 7 సబ్ స్టేషన్లు మంజూరు చేయించామని, అందులో పోగిళ్ళ, మేడారం, గాజీనగర్ సబ్ స్టేషన్ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో డీఈ విద్యాసాగర్, ఏడి సైదులు, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమునా మాధవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, పిఎసిఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రేఖా శ్రీధర్ రెడ్డి,నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఊట్కూరి వేమన్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, మేకల శ్రీనివాస్ యాదవ్, మాడుగుల యాదగిరి, మాజీ ఎంపీటీసీ లక్కిదాస్ నాయక్,కాసర్ల వెంకటేశ్వర్లు, కాంట్రాక్టర్ నేనావత్ సంతోష్,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.