calender_icon.png 27 July, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లుకున్న నిర్లక్ష్యం..

26-07-2025 03:22:31 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): వర్షాకాలంలో విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్ కో అధికారులు పదే పదే సూచనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం విద్యుత్ స్థంభాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి శివారులో, రాఘవాపూర్ గ్రామం ప్రధాన రహదారి సమీ పంలో  ట్రాన్స్ఫార్మర్ కు, విద్యుత్ స్తం భాల వైర్లకు చెట్ల తీగలు అల్లుకొని ప్రమాద భరితం గా మారాయి. అయినప్పటికీ వైర్లకు అల్లుకున్న తీగ అధికారుల తీరు ఎలా ఉందో తేటతెల్లం చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్సఫార్మర్ కు, విద్యుత్ వైర్లకు అల్లుకుని ఉన్న తీగలను తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.