calender_icon.png 26 January, 2026 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహాయక చర్యలో ప్రభుత్వం విఫలం

03-09-2024 01:12:10 AM

మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి 

హైదరాబాద్,సెప్టెంబర్2(విజయ క్రాంతి): వరద సహాయక చర్యలు వేగంగా చేపట్టడంలో రేవంత్ సర్కా ర్ విఫలమైందని  మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. వర్షాలతో రాష్ర్టం అల్లకల్లోలం అవుతుం టే సీఎం ఏం చేస్తున్నారని నిలదీశా రు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి భడే భాయ్‌ని హెలికాప్టర్ పంపించమని ఎందుకు అడగలే దని ప్రశ్నించారు. సీఎం రెండు రోజులుగా కనిపించకుండా పోయి, వరద లు తగ్గుముఖం పట్టే సమయంలో తీరిగ్గా బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో వరదలో చిక్కుకున్న 9 మంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సాయం అందక సొంతంగా గజ ఈతగాళ్లను తెప్పించుకొని బయటపడడం సిగ్గుచేటన్నారు.