calender_icon.png 26 January, 2026 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంచెలంచెలుగా ఎదిగి..

26-01-2026 03:04:59 AM

కార్పొరేటర్ నుండి కేంద్ర, రాష్ట్ర మంత్రుల వరకు...

కరీంనగర్, జనవరి25 (విజయ క్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా ఓనమాలు దిద్ది కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఎదిగిన నేతలు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ప్రముఖులుగా వెలుగుతున్న ఎందరో నాయకులకు పునా ది. ఒకప్పుడు వార్డు మెంబర్లుగానో, కౌన్సిలర్లుగానో తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన వారే. మురికి కాలువలు, వీధి దీపాల సమస్యలతో మొదలైన వారి ప్రయాణం.. నేడు రాష్ట్ర, కేంద్ర స్థాయి విధాన నిర్ణయాలను ప్ర భావితం చేసే స్థాయికి చేరింది.

నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాజకీయ ఎదుగుదల ఒక సంచలనమే చెప్పవచ్చు. 2005లో కరీంనగర్ ము న్సిపాలిటీ కార్పొరేషన్ గా మారిన తొలి ఎ న్నికల్లోనే 48వ డివిజన్ నుంచి బీజేపీ కా ర్పొరేటర్ విజయం సాధించారు. వరుసగా మూడు సార్లు (2005-2019) కార్పొరేటర్ గా గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఆయన, కార్పొరేషన్ వేదికగానే ప్రజాసమస్యల పై పోరు స ల్పి నేతగా ఎదిగారు. 2019, 2024 లోకసభ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి, నేడు కేంద్ర మంత్రిగా దేశ రాజకీయాల్లో కీలక పా త్ర పోషిస్తున్నారు.

మాజీ మంత్రి, ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 20 00లో టీడీపీ కౌన్సిలర్ రాజకీయ ఆరంగే ట్రం చేశారు. మున్సిపాలిటీలో ఫ్లోర్ లీడర్ గా అనుభవం గడించిన ఆయన 2005లో కార్పొరేటర్ గా గెలిచారు. గల్లీ రాజకీయాల్లో సంపాదించిన పట్టుతో 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.

 చైర్మన్ పదవి నుంచి అసెంబ్లీకి..

మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన అనుభ వం శాసనసభలో రాణించడానికి ఎలా తో డ్పడుతుందో అనడానికి సోమారపు సత్యనారాయణ, కటారి దేవేందర్ రావులే నిదర్శ నం. 1998లో రామగుండం మున్సిపాలిటీ తొలి చైర్మన్ గా ఎన్నికైన సోమారపు సత్యనారాయణ నగరాభివద్దిలో కీలక పాత్ర పోషిం చారు. అనంతరం 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచి ఆర్టీసీ చైర్మెన్ గా కూడా బాధ్యత లు నిర్వహించారు.

1981లో ఇండిపెండెంట్ కౌన్సిలర్గా గెలిచిన కటారి దేవేందర్రావు మూడు సార్లు మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి ’అపర చాణక్యుడి’గా పేరు తెచ్చుకున్నారు. ఆ అనుభవంతోనే 1999లో కరీంనగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కరీంనగర్ ము న్సిపాలిటీలో కౌన్సిలర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత బొ మ్మా వెంకటేశ్వరు ఆ తర్వాత ఇందుర్తి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు. వేములవాడ దేవస్థాన చైర్మెన్ గానూ పని చేశారు.

ప్రస్తుతం రామగుండం మాజీ ఎ మ్మెల్యేగా ఉన్న కోరుకంటి చందర్ గోదావరిఖనిలో 2004లో కౌన్సిలర్ రాజకీయ ప్ర స్థానం మొదలైంది. 2018లో రామగుండం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ మంత్రి చలిమెడ ఆనందరావు, ప్రేమలతా దేవి, జువ్వాడి చంద్రశేఖర్ రావు, మాజీ ఎ మ్మెల్సీలు టి.సంతోష్ కుమార్లు మున్సిపల్ రాజకీయాల నుంచి వచ్చిన వారే. మున్సిపల్ ఎన్నికలు కేవలం వార్డు సభ్యులను ఎ న్నుకునే ప్రక్రియ కాదు.. అవి భవిష్యత్ మంత్రులను, ఎంపీలను తయారు చేసే శిక్ష ణా కేంద్రాలుగానే చెప్పవచ్చు. రేపు రాబో యే మున్సిపల్ ఎన్నికల ద్వారా మరోసారి కొత్త తరం నాయకులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.