26-01-2026 02:35:39 AM
పద్మ పురస్కార గ్రహీతలకు కేటీఆర్ అభినందనలు
హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు దక్కడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 131 మందికి పురస్కారాలు ప్రకటించగా, అందులో తెలంగాణ నుంచి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మేధావులకు సముచిత స్థానం లభించడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు.
ముఖ్యంగా సైన్స్, వైద్యం, కళలు, పశుసంవర్థక వంటి విభిన్న రంగా ల్లో తెలంగాణ ప్రతిభ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అ భినందనీయమని పేర్కొన్నారు. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో విశేష పరిశోధనలు చేసిన చంద్ర మౌళి గడ్డమానుగు, కష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్, కు మారస్వామి తంగరాజ్‌లకు పద్మశ్రీ పురస్కారాలు లభించడం వారి మేధస్సుకు దక్కిన గౌరవమని కేటీఆర్ ప్రశంసించారు.
వైద్య రంగంలో సర్జన్ గూడూరు వెంకట్‌రావు, ప్రముఖ క్యాన్సర్ నిపుణులు పాల్కొండ విజయ ఆనంద్‌రెడ్డికి ఈ అత్యున్నత గౌరవం దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కూచిపూడి నత్య కళాకారిణి దీపికా రెడ్డికి నత్య రంగంలో ఆమె చేసిన అద్భుత ప్రదర్శనలకు ఈ పురస్కారం లభిం చిందన్నారు. పశుసంవర్ధక రంగంలో నిస్వార్థ సేవలు అందించిన రామారెడ్డి మామిడికి మరణానంతరం పద్మశ్రీ ప్రకటించడం ఆయన చేసిన సేవకు దక్కిన నిజమైన గుర్తింపు అని కేటీఆర్ అభివర్ణించారు.