26-01-2026 02:44:15 AM
పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు
హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి) : మున్నూరు కాపులు రాజీయంగా మరింత ఎదగాలని, మున్సిపల్ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ సీట్లలో విజయం సాధించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంత రావు అన్నారు. బీసీల అభివృద్ది కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆయన సూచించారు. తెలంగాణలో విజయం సాధించిన మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సర్పంచ్‌ల్లో విజయం సాధిం చిన మున్నురుకాపు సర్పంచ్‌లకు ఆదివారం సికింద్రాబాద్‌లోని ఒక పంక్షన్‌హాల్‌లో సన్మానం చేశారు.
అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌తోపాటు కేశవరావు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదిరులు పాల్గొన్నారు. వీహెచ్ మాట్లాడుతూ ప్రభుత్వం మున్నూరుకాపులకు ఇచ్చిన 5 ఎకరాల స్థలంలో మున్నూరుకాపు మహిళా విద్యార్థులకు హాస్టల్ వసతి నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన సూచించారు.