26-01-2026 11:18:28 AM
షాద్ నగర్ డీసీపీ సిహెచ్ శిరీష..
షాద్‌నగర్, జనవరి 26, (విజయక్రాంతి): డ్రగ్స్ నిర్మూలనపై ప్రజలలో మరింత అవగాహన కల్పిస్తామని షాద్ నగర్ డిసిపి సిహెచ్ శిరీష అన్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని షాద్ నగర్ ఏసిపి కార్యాలయంలో జరిగిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా డిసిపి శిరీష మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం ఎప్పుడు సవాలతో కూడుకున్నదని, శాంతిభద్రతల పర్యవేక్షణకు ఎటువంటి లోపం కలుగుతున్న ఎప్పుడు ముందుంటామని పేర్కొన్నారు. షాద్ నగర్ జోన్ డీసీపీగా తనని నియమించినందుకు చాలా ఆనందంగా ఉందని, సీనియర్ అధికారుల సూచనల మేరకు నడుచుకోవాల్సిన విధివిధానాలను సిబ్బందికి తెలియజేశామని తెలిపారు.. ప్రజల రక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసిపి లక్ష్మీనారాయణ, సీఐ విజయ్ కుమార్, డిఐ వెంకటేశ్వర్లు, ఎస్బి ఎస్ఐ దేవకి, ఎస్సైలు ప్రణయ్, శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.