calender_icon.png 26 January, 2026 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణిని కాపాడుకుందాం

26-01-2026 02:03:48 AM

  1. సంస్థ బలోపేతానికి కేంద్ర సహకారం అందిస్తుంది 
  2. కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి కిషన్ రెడ్డి 
  3. అండర్ గ్రౌండ్ బొగ్గు బావిలో మంత్రి పర్యటన 

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 25, (విజయక్రాంతి): సింగరేణి సంస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటనలో భాగంగా ఆదివారం కొత్తగూడెంలోని 74 సంవత్సరాల నాటి  పీవీకే 5 అండర్ గ్రౌండ్ బొగ్గు గనిలో మంత్రి పర్యటించారు.

ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ బొగ్గు బావుల పరిస్థితిని, ఉత్పత్తి వివరాలను అధికారులను, కార్మికులను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి సంస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా కార్మికులకు వివరించారు. అండర్ గ్రౌండ్ మైన్ లతోపాటు ఓపెన్ కాస్ట్ బొగ్గు బావుల్లోను కార్మికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని అధికారులను ఆదేశించారు.

136 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ దక్షిణ భారతదేశంలోనే మంచి కోల్ కంపెనీ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రాంతానికి వెన్నెముక లాంటి సమస్త సింగరేణి అని స్పష్టం చేశారు. సంస్థను ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు.