calender_icon.png 21 November, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత రంగాన్ని విస్మరించిన ప్రభుత్వం

21-11-2025 12:00:00 AM

అసెంబ్లీలో చేనేత సమస్యలపై గళం విప్పాలని.. 

కేటీఆర్‌కు విన్నవించిన రాజోళి చేనేత కార్మికులు

అలంపూర్, నవంబర్ 20 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న చేనేత రంగాన్ని పట్టించుకోవడంలేదని నిధులు కేటాయించకపోవడంతో చేనేతరంగం అంతరించిపోయే అవకాశాలు ఉన్నాయని వచ్చే అసెంబ్లీ సమావేశాలలో చేనేత కార్మికుల సమస్యలపై గళం విప్పాలని రాజోలి చేనేత కార్మికులు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విన్నవించారు.

ఈ మేరకు గురువారం హైదరాబాద్ లో  చేనేత కార్మికులు కేటీఆర్ ను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సమక్షంలో  కలిసి చేనేత కార్మికుల సమస్యలపై  వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ... ప్రభుత్వం కల్పించిన రుణమాఫీ, సబ్సిడీ రుణాలు అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వచ్చే అసెంబ్లీ సమావేశాలలో చేనేత రంగానికి జరుగుతున్న అన్యాయంపై చర్చకు తీసుకురావాలని ఈ కేటీఆర్ కు సందర్భంగా విన్నవించారు.ఈ కార్యక్రమంలో రాజోలి మండల చేనేత కార్మికులు నాయకులు పాల్గొన్నారు