21-11-2025 12:00:00 AM
చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్‌రెడ్డి
ఎల్బీనగర్, నవంబర్ 20 : చంపాపేట డివిజన్ పరిధిలో యాదగిరి నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ ట్రంక్ లైన్ పనులు జీహెచ్‌ఎంసీ, జలమండలి, కాంట్రాక్టర్‌తో కలిసి పర్యవేక్షించారు. ఈ సంద ర్భంగా వంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ... యాదగిరి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 12లో సరైన డ్రైనేజీ అవుట్లెట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నా రన్నారు.
ముంపు సమస్య పరిష్కారంగా, పక్కనే ఉన్న కొంత మేర ప్రైవేట్ స్థలం, పార్క్ స్థలం ద్వారా డ్రైనేజీ లైన్ తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. స్థల యజమానులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు పోరెడ్డి రవీందర్ రెడ్డి, నాయకులు లింగాల దశరథ్ గౌడ్, శ్రీనివాస్ నాయుడు, జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుమిత్ సింగ్, యాదగిరి నగర్ కాలనీవాసులు బక్కప్ప, కృష్ణారెడ్డి, యాదయ్య గౌడ్, దామోదర్ రెడ్డి, రమేష్ పాల్గొన్నారు.