calender_icon.png 10 July, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద రైతులపై దౌర్జన్యం చేస్తున్న సర్కారు

10-07-2025 12:06:59 AM

 చేవెళ్ల, జులై 9:పేద రైతులపై కాంగ్రెస్ సర్కారు దౌర్జన్యం చేస్తోందని బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. బుధవారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్కెపల్లిలో ధర్నా చేస్తున్న రైతులకు మద్దతు తెలిపి, వారు సాగు చేసిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంత రెడ్డి మాట్లాడుతూ..  దళిత, బీసీ వర్గాలకు చెందిన 50 పేదల కుటుంబాలు 70 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న సర్వేనెంబర్ 180లోని 99.14 ఎకరాలను గోశాలకు కేటాయించడం సరికాదని మండిపడ్డారు.

వారికి కనీసం పరిహారం తేల్చకుండా బలవంతంగా గుంజుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరాకు కేవలం 300 గజాలు ఇస్తామనడం ఏంటని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, లేదా రైతుల కోరుతున్న విధంగా ఎకరాకు1000 గజాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్‌ఎస్ పక్షాన ఎంత వరకైనా పోరాటం చేస్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు దారెడ్డి వెంకటరెడ్డి, బీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు పూసల పరమేశ్, నేతలు బట్టు మల్లేశ్, గణేశ్ రెడ్డి, జయవంత్, సురేశ్ తదితరులుపాల్గొన్నారు.