calender_icon.png 10 July, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెట్లను ప్రతి మానవుడు విరివిగా పెంచాలి

10-07-2025 12:06:56 AM

  1. జిల్లా కేంద్రంలో వన మహోత్సవం

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

వనపర్తి, జూలై 9 ( విజయక్రాంతి ) : మానవాళికి ప్రాణ వాయువునిచ్చి మనుగడనిచ్చే చెట్ల ను ప్రతి మానవుడు విరివిగా పెంచాలని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవా రం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని ఎకో పార్కులో చెట్లు నాటే కార్యక్రమా నికి జిల్లా కలెక్టర్ ఇంచార్జి విజయేంద్ర బోయి, అ దనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, డి.ఎఫ్. ఓ సత్యనారాయణతో కలిసి శాసన సభ్యులు మొ క్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏది ఉన్నా లేకున్నా సమస్త మానవాళి జీవనానికి ప్రాణ వాయువు అవసరం ఉం టుందని అలాంటి ప్రాణ వాయువును ఇచ్చే చెట్లను విరివిగా నాటి వాటిని సంరక్షించుకోవాల్సి న అవసరం ఉందని గుర్తు చేశారు.

ర్యావరణం సమతుల్యంగా ఉండటానికి 33 శాతం అటవీ ప్రాంతం ఉండాలని, కానీ వనపర్తి జిల్లాలో 18-19 శాతం మాత్రమే ఉందని దీనిని 33 శాతానికి పెంచడానికి జిల్లాలోని ప్రజలందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.జిల్లాలోని ప్రతి విద్యార్థి, యువత తమ ఇళ్లలో, పొలాల్లో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ చెట్లు నాటాలని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యతను విద్యార్థులు తీసుకోవాలని సూచించారు.

పర్యావరణ సమతుల్యతను పాటించేందుకు వన మహోత్సవం కార్యక్రమం.... వనపర్తి జిల్లా ఇంచార్జి కలెక్టర్ విజయేంద్ర బోయి.రాష్ట్రంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ సమతుల్యతను పాటించేందుకు వన మహోత్సవం కార్యక్రమం ద్వారా  మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఈ వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై మొక్కలు నాటాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ (వనపర్తి జిల్లా ఇంచార్జి కలెక్టర్ ) విజయేంద్ర బోయి జిల్లా ప్రజలకు సూచించారు.

జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి సత్య నారాయణ, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు, విద్యార్థులు, అటవీ శాఖ సిబ్బంది అందరూ పాల్గొని తల ఒక మొక్కను నాటారు.