07-05-2025 04:45:29 PM
బీజేపీ నాయకుల డిమాండ్...
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పొన్నారం, వెంకటాపూర్, లేమూరు గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా సీనియర్ నాయకులు దేవరనేని సంజీవరావు, మండల నాయకులు వంజరి వెంకటేష్ లు డిమాండ్ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలోని వర్షానికి తడిసిన ధాన్యాన్ని బుదవారం వారు పరిశీలించి మాట్లాడారు. అకాల వర్షానికి రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యం పూర్తిగా తడిచి పోయిందని, కొన్ని కొనుగోలు కేంద్రాలలో వడ్లు బస్తాలలో నింపి కాంట చేసిన సంచులు వర్శానికి తడిసి పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు ఆరు గాలం కష్టపడి పండించిన పంట వర్షానికి తడిసిందని తడిసిన ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని, తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని మైచర్ పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని లేకుంటే రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం మండల అధ్యక్షులు పెంచాల రంజిత్, నాయకులు ధరవేణి రవి, కర్ర రాజయ్య, దుర్గం మల్లేష్, గంజి రాజేష్, మనుబోతుల రమేష్, సిద్ధన లచ్చయ్య, సురిమిల్ల రామకృష్ణ, సలేంద్ర శ్రీనివాస్ జుమ్మిడి దిలీప్, సుద్దుల సత్తయ్యలు పాల్గొన్నారు.