calender_icon.png 8 May, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఎక్స్ రే మిషన్ రిపేర్ చేయించాలి

07-05-2025 04:41:59 PM

సిపిఎం టౌన్ కార్యదర్శి లిక్కీ బాలరాజు..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఎక్స్ రే మిషన్ రిపేర్ చేయించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు(CPM Urban Secretary Likki Balaraju) డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్ కి ఒక రోగిని వైద్య నిమిత్తం తీసుకెళ్తే, డాక్టర్లు చూసి ఎక్స్ రే మిషన్ తీయాలని ఆసుపత్రిలో ఎక్స్ రే మిషన్ పనిచేయడం లేదని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేస్తుంటే, క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

డబ్బులు వెచ్చించి ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లే స్తోమత లేక ప్రభుత్వ హాస్పిటల్ కి వస్తున్నారని అలాంటి వారికి సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆయన విమర్శించారు. హాస్పిటల్లో ఎక్స్ రే మిషన్ పని చేయకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని తక్షణమే ఎక్స్ రే మిషన్ రిపేర్ చేయించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సుల పోస్టులు భర్తీ చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి సరైన సౌకర్యాలు కల్పించకపోతే హాస్పిటల్ కి వస్తున్న ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.