13-11-2025 04:48:17 PM
బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్..
చిట్యాల (విజయక్రాంతి): తుఫాన్ ప్రభావంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్, మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఆంజనేయ, బాలమురుగన్ కాటన్ మిల్ లో ఏర్పాటుచేసిన సిసిఐ కొనుగోలు కేంద్రాలను పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం నిబంధన ఎత్తివేయాలని కోరారు. మిల్లర్లు సిసిఐ అధికారులు కుమ్మక్కై పత్తిలో క్వింటాకు 5 నుంచి 10 కిలోల తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్, మండల ప్రధాన కార్యదర్శి మడికొండ రవీందర్రావు, యూత్ అధ్యక్షుడు తౌటం నవీన్, టౌన్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీధర్, సాద మల్లయ్య, పాండ్రాల వీరస్వామి, పెరుమాండ్ల రవీందర్ గౌడ్, ఏలేటి రాజు పర్లపల్లి భద్రయ్య, దామెర రాజు నోముల నాగరాజు, మర్రి నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.