calender_icon.png 13 November, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ పై...

13-11-2025 04:51:28 PM

- విద్యార్థి సంఘ నాయకుల దాడిని ఖండిస్తున్నాం..

- మంచిర్యాల జిల్లా ట్రస్మా 

మంచిర్యాల (విజయక్రాంతి): వరంగల్ జిల్లాలోని స్మైల్ డిజీ స్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పై PDSU విద్యార్థి సంఘం నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ గురువారం మంచిర్యాల జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం(TRSMA) ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, పాఠశాలల ఉపాధ్యాయులు ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా కోశాధికారి ఉదారి చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ సమాజంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ మంత్రి రేవంత్ రెడ్డినీ కోరారు. 

మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు కొమ్ము దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ జరిగిన సంఘటనను ఖండిస్తూ, పాఠశాల ఆవరణలోకి కేవలం తల్లిదండ్రులను మాత్రమే అనుమతించే విధంగా, విద్యార్థి సంఘ నాయకులకు, కుల సంఘ నాయకులకు, రాజకీయ నాయకులకు, ఇతరులు ఎవరికీ పాఠశాల లోపలికి అనుమతిని ఇవ్వకుండా ఒక జీవో విడుదల చేయాలన్నారు. పాఠశాలలపై, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులపై దాడులు జరుగకుండా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు.

మహిళా ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఇలాంటి దాడులను చూసి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాలంటే భయం అవుతుందని, పాఠశాలలో శ్రద్ధతో  స్వేచ్ఛగా పాఠాలు చెప్పుకునే గురువులు ఆత్మ రక్షణ కోసం ఇలా రోడ్లపైకి వచ్చి జరిగిన సంఘటనపై నిరసన తెలిపే పరిస్థితి రావడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర నాయకులు రాపోలు విష్ణువర్ధన్ రావు, కస్తూరి పద్మ చరణ్, యార్లగడ్డ బాలాజీ, పట్టణ కార్యదర్శి సాదిక్ పాషా, కోశాధికారి మోహన్ వర్మ, జిల్లా నాయకులు ప్రవీణ్ కుమార్, ఉస్మాన్ పాషా, జాన్ థామస్, శేఖర్, సాదిక్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.