calender_icon.png 21 November, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది

21-11-2025 12:33:39 AM

ఎమ్మెల్యే కవ్వంపల్లి

బెజ్జంకి నవంబర్ 20:పేదవారి సొంతింటి కలను సాకారం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని స్థానిక మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన నాలుగు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఐదు లక్షలు మంజూరు చేస్తుందని అన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా మంజూరైన రూ.3.07 లక్షల విలువ గల 12 చెక్కులను వీరాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లబ్ధిదారులకు అందజేశారు. .. సీఎంఆర్‌ఎఫ్ నిరుపేదలకు వరం అని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, తహశీసిల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో ప్రవీణ్, దామోదర్, రత్నాకర్, బైరీ సంతోష్.శరత్ తదితరులు పాల్గొన్నారు.