21-11-2025 12:33:21 AM
మందమర్రి, నవంబర్ 20 : మందమర్రి పట్టణంలోని జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని గురువారం జాతీయ రహదారి అధికారులు, పట్టణ పోలీసుల సంయుక్తంగా యాపల్, కేకే2 ఏరియాలలోని సర్వీస్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేం దుకు శాశ్వత పరిష్కారంగా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
యాపల్ ఏరియాను రోడ్డు ప్రమాదాలకు ’బ్లాక్ స్పాట్’గా గుర్తించిన పట్టణ పోలీసులు తమ వంతు కృషిగా జాతీయ రహదారి అధికారులతో సమన్వయంతో రోడ్డు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది జాతీయ రహదారి అధికారులు పాల్గొన్నారు.