24-05-2025 01:15:56 AM
ధ్వజస్థంభం, బొడ్రాయి ఏర్పాటు
కోహిర్, మే23: మండలంలోని ఖానాపూర్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో గ్రామ దేవతలు మేడాలమ్మ, ఖేత మ్మ విగ్రహాల ప్రతిష్టాపన కార్య క్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వ హించారు.
వేదపండితుల మంత్రో చ్చరణల మధ్య హోమం, ప్రాణ ప్రతిష్ఠ చేసి భాజాభజంత్రీలు, మం గళవాయిద్యాలు మారుమ్రోగు తుండగా అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమా న్ని నిర్వహించారు. అనంతరం బొడ్రాయి, ధ్వజ స్థంభం ఏర్పాటు చేశారు. తీర్థ ప్రసాద వితరణ అన్నదానం చేశారు. అహోరాత్రులు భజన సంకీర్తనలు ఆలపించారు. కార్యక్రమాలు తికించడానికి పెద్ద సంఖ్యలో భక్తులుతరలివచ్చారు.