calender_icon.png 26 November, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

26-11-2025 12:33:57 AM

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల అర్బన్, నవంబర్ 25 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లో ఏర్పడ్డ ప్రజా ప్రభు త్వం కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేసే దిశగా అడుగులు వేస్తుందని జగి త్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అ న్నారు.జగిత్యాల కలెక్టరేట్ సమావేశం మం దిరంలో నిర్వహించిన వడ్డీ లేని రుణాల పం పిణీ కార్యక్రమం లో జగిత్యాల ఎమ్మెల్యే డా క్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జగిత్యాల జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ప్ ఆద్వర్యంలో జగిత్యాల నియోజకవర్గంలో 2434 స్వయం సహాయక సం ఘాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రు.2 కోట్ల 12 లక్షలు వడ్డీ లేని రుణాల పం పిణీ కార్యక్రమంలో పాల్గొని చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ స్వాతం త్య్రంకు ముందు, స్వాతంత్య్రం తర్వాత ఇందిరమ్మ కుటుంబం చేసిన త్యాగం, పరిపాలన విధానం వెల కట్టలేనిదన్నారు.దేశంలో తొలి మహిళ ప్రధానిగా, ఉక్కు మహిళగా స్వర్గీయ శ్రీమతి ఇందిరమ్మ ఖ్యాతి గడించిందన్నారు.

ఇందిరమ్మ పాలనలో గరిబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ లాంటి ప్రజా ఉపయోగ విధానాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశ అభివృద్ధికి బాటలు వేశారన్నారు. మహిళాభివృద్ధి కొరకు రాష్ట్ర ప్ర భుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వివరించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఎన్నికల తర్వాత గ్రామాల అభివృద్ధి కి నిధుల వరద ప్రారంభం అవుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం రు. 5 లక్షలు అందిస్తుందన్నారు.

లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని, అధికారులు బిల్లులు తొందరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక, సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండే రాష్ట్రంలో పం డగ వాతావరణం ఏర్పడిందన్నారు. అప్పటి నుండి మొదలు నేడు ఇందిరమ్మ మహిళా స్వశక్తి చీరల పంపిణీ తో పండగ కళ రెట్టింపు అయ్యిందని తెలిపారు.మహిళలకు అందిస్తున్న అవకాశాలను సద్వినియో గం చేసు కోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజ గౌడ్, డిఆర్డిఓ రఘువరన్, జిల్లా, మండల, గ్రామ సమాఖ్య సభ్యులు, సెర్ప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.