calender_icon.png 10 January, 2026 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

10-01-2026 02:12:14 AM

నిశిత డ్రిగీ కళాశాల తొలిసారిగా నిర్వహణ  

నిజామాబాద్, జనవరి 9: నిజామాబాద్‌లోని నిశిత డిగ్రీ కళాశాల(అటానమస్) తొలిసారిగా గ్రాడ్యుయేషన్ డేను బుధవారం నగరంలోని శ్రావ్య గార్డెన్‌లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి.బాలకిష్ణారెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ యాదగిరిరావు, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం.యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదుగా విద్యార్థినీ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు.

అలాగే కాలేజీ యూజీ టాపర్‌కి భూమయ్య అవార్డుతో పాటు, మూడు సంవత్సరాల ఫీజును తిరిగి ఇచ్చేశారు. తల్లిదండ్రులను సన్మానించారు. క్లాస్ టాపర్స్ విద్యార్థులకు కూడా గోల్డ్ మెడల్స్‌ను అందజేశారు. ముఖ్య అతిథి బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యా వ్యవస్థ ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికలకు అనుగుణంగా అప్‌డేట్ చేసుకోవాలన్నారు.

నిశిత సంస్థ విద్యార్థులకు అన్ని స్థాయిల్లో ప్లేస్‌మెంట్ అవకాశాలను కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నిఖిల్, చీఫ్ ప్యాట్రన్ వినయ్, కోఆర్డినేటర్ రాజు, ఆకాడమిక్ అడ్వైజర్ సాయిలు, డైరక్టర్ షేక్, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వప్న, వైస్ ప్రిన్సిపాల్ రఘువీర్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.