10-01-2026 01:56:31 AM
మేడారం, జనవరి 9 (విజయక్రాంతి) : భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పా ట్లు చేయాలని, జాతర ప్రారంభానికి ఇంకా ౧౮ రోజులే ఉన్నందున యుద్ధప్రాతిపదికన ప నులు పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందరావు డిమాండ్ చేశారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తిం పు ఉన్న ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
శుక్రవారం ఆయన మేడారానికి చేరుకు న్నారు. ముందుగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు,గోవిందరాజుల గద్దెలను దర్శించుకుని ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం పూజలు చేశారు. నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) మొక్కు చెల్లించుకున్నారు. తర్వాత గద్దెల ఆవరణలో నిర్మాణ దశలో ఉన్న మాస్టర్ ప్లాన్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం జాతరలో భక్తులకు సౌకర్యాలు అంతంతమాత్రం గానే ఉన్నాయని, తాము స్వయంగా పరిశీలించే ఈ విషయాన్ని చెప్తున్నామని తెలిపారు.
మంత్రులు హెలికాఫ్టర్లలో వచ్చిపోతు న్నారని, పనుల పర్యవేక్షణ పట్ల వారికి పట్టింపు లేదని ఆరోపించారు. వారు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే భక్తుల సమస్యలు తెలుస్తాయని హితవు పలికారు. మేడారానికి అనుసంధానం చేసే రహదారుల పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయని, వాటిని పూర్తి చేయకపోవడం తో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
బీజేపీ రాష్ట్ర చీఫ్ వెంట ఆ పార్టీ ము ఖ్యనేత మార్తినేని ధర్మారావు, పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, జిల్లా ప్ర ధాన కార్యదర్శి భర్త పురం నరేశ్, రాష్ట్ర ప్రధా న కార్యదర్శులు వీరేందర్ గౌడ్, గౌతంరావు, కోశాధికారి వాసుదేవరావు, ఇతర నేతలు కొరదాల నరేష్, చింతలపూడి భాస్కర్‌రెడ్డి, భూక్యా రాజూనాయక్, భూక్యా జవహర్‌లాల్, గుగులోతు స్వరూప, శ్రీమంతుల రవీంద్రాచారి, జా డి వెంకట్, నగరపు రమేశ్, జినుకల కృష్ణాకర్ రావు, ఏనుగు రవీందర్‌రెడ్డి, అల్లే శోభ న్, మద్దినేని తేజరాజు, డేగల సలేందర్, సమ్మక్క ప్రధా న పూజారి సిద్ధబోయిన సురేందర్ ఉన్నారు.