14-05-2025 11:23:42 PM
డ్రైవర్ కు గాయాలు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో అర్పణ పల్లి పంచాయితీ ట్రాక్టర్ ఫల్టీ కొట్టింది. ఈ సంఘటనలో డ్రైవర్ సందీప్ గాయపడ్డాడు. అతని వెంటనే సమీపంలో ఉన్నవాళ్లు గమనించి 108 అంబులెన్స్ కు సమాచారం అందించి మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాట్రపల్లి గ్రామంలో బొడ్రాయి మూడవ సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలకు నీటి సరఫరా కోసం అర్పణ పల్లి పంచాయతీ నుంచి ట్రాక్టర్ తీసుకువచ్చి తిరిగి ఇచ్చేందుకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న పశువులను తప్పించబోగా ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది.