calender_icon.png 22 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ

22-09-2025 12:11:59 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు, సెప్టెంబర్ 21 :తొలి, మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని బాపూజీ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మూడు తరాలపాటు అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. జాతికి వారు చేసిన సేవలను భవిష్యత్తు తరాలకు అందించాలన్న సమన్నత లక్ష్యంతో పటాన్చెరులో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అదృష్టం తనకు దక్కిందన్నారు.

బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వంగరి అశోక్ , కంకర సీనయ్య, వెంకటేష్, రుద్రారం శంకర్, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి రఘురాములు, ధర్మచంధ్, పశుపతి, గీతా వెంకట్, మధు, లక్ష్మణ్, కృష్ణ, వర ప్రసాద్, రాములు,  పట్టణ నాయకులు, కార్యకర్తలు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.