15-09-2025 12:00:00 AM
అమరులకు నివాళులర్పించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
మునుగోడు, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చెయ్యకపోతే హైదరాబాద్ మరో పాకిస్తాన్ల మారేదని, సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే అని సిపిఐ జిల్లా కార్యదర్శి, మ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. 77 వ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఆదివారం పలివెల, కొరటికల్ గ్రామంలో సాయుధ పోరా ట యోధులు కొండవీటి గురునాథరెడ్డి, కొండవీటి బచ్చిరెడ్డి, కొండవీటి జగన్మోహన్ రెడ్డి విగ్రహాలకు మిరియాల లింగయ్య , నువ్వు ఓటి అంజయ్య అమరవీరుల కుటుం బ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సిపిఐ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.
సా యుధ పోరాటంలో పాశం పుల్లారెడ్డికి వ్యతిరేకంగా పలివెల గ్రామం నుండి నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన కొండవీటి కుటుం బం పోరాటాలు చేసి నిజాం సర్కార్ నుండి పేద ప్రజలకు విముక్తి కలిగించారన్నారు. సాయుధ పోరాటం ద్వారానే నిజామును లొంగదీశారన్నారు. సాయుధ పోరాటంలో పలివల గ్రామం నుండి బచ్చిరెడ్డి గుర్నాథ్ రెడ్డి గోస్కొండ పెద్దులు మరో 30 మంది పోరాట యోధులు నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలు చేశార న్నారు.
ఈ కార్యక్రమంలో కొండవీటి సునీల్ రెడ్డి, కొండవీటి రవీందర్ రెడ్డి, కొండవీటి సురేందర్ రెడ్డి, కొండవీటి శేఖర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రామచంద్రం, వెంకటేశ్వర్లు, నరసింహ, సిపిఐ జిల్లా సమితి సభ్యులు చలపతి, మండల కార్యదర్శి శ్రీను, పాండు, రమేష్, మాజీ జెడ్పిటిసి లింగయ్య, మాజీ ఎంపీపీ సాయిలు, నరసింహ, యాద య్య, కైలాష్, వెంకన్న, ఎండి జానీ, వెంకన్న, సత్తమ్మ, మల్లేష్ ఉన్నారు.