calender_icon.png 15 September, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంప్రదాయంగా బసవన్నకు అంత్యక్రియలు

15-09-2025 12:00:00 AM

ఆదిలాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాం తి): వ్యవసాయంలో 30 ఏళ్ల పాటు చేదోడువాదోడుగా నిలిచి, అనారోగ్యంతో మృతి చెందిన బసవన్న కు సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. బోరజ్ మం డలంలోని లేఖర్ వాడ గ్రామానికి చెందిన అరికెల శ్రీకాంత్‌కు సంబంధించిన ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది.

అయితే గత 30 ఏళ్లుగా వ్యవసాయంలో ఆయనకు చేదోడువాదోడుగా నిలిచిన ఎద్దు మృతి చెం దడంతో యజమాని అరికెల శ్రీకాంత్ గ్రామస్తులతో కలిసి ఆదివారం ఎద్దుకు అంత్యక్రి యలు నిర్వహించారు. ఓ మనిషి చనిపోతే ఎలాగైతే అంత్యక్రియలు నిర్వహిస్తారో అంతే సాంప్రదాయబద్ధంగా డప్పు చప్పుల మధ్య ఎడ్ల బండిలో ఎద్దు మృతదేహాన్ని గ్రామ పురవీధుల గుండా అంతిమయాత్రగా నిర్వహించి, గ్రామ సమీపంలోని తన పంట పొలంలోనే ఎద్దుకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.