calender_icon.png 17 December, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ధన్వంతరి’పై హైకోర్టు తీర్పు హర్షణీయం

17-12-2025 01:43:51 AM

ధన్వంతరి అగ్రివ్డ్ ఇన్వెస్టర్స్ అసోసియేషన్..

ముషీరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ధన్వంతరి ఫౌండేషన్ ఆస్తులను జప్తు చేయాలంటూ నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తూ మంగళవారం ఉ త్తర్వులు జారీ పట్ల ధన్వంతరి ఫౌండేషన్ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ధన్వంతరి అగ్రివ్డ్ ఇన్వెస్టర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు అన్నమరాజు నాగరాజు మాట్లాడారు.

కమలాకరశర్మ ధన్వంతరి ఫౌం డేషన్ ఏర్పాటు చేసి, తమకు అధిక లాభాలు ఆశచూపాడన్నారు. సుమారు రెండు వేల మంది నుండి రూ.220 కోట్లు వసూలు చేశారని తెలిపారు. 2023లో  తాము హైదరాబా ద్ సీసీఎస్ లో ఫిర్యాదు చేశామన్నారు. సీసీఎస్ డీసీపీ శ్వేతా, ఏసీపీ ఆది నారా యణ పర్యవేక్షణలో కేసు పురోగతి సాధించిందన్నారు. ఈ కేసులో నాం పల్లి క్రిమినల్ కోర్టు ధన్వంతరి ఆస్తులను జప్తు చేసి, బాధితులకు న్యాయం చేయాలని తీర్పు ఇచ్చిందన్నారు.

కమలాకర శర్మ ఆ తీర్పుపై స్టే కోరుతూ హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారన్నారు. సీసీఎస్ పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్ధించిందని తెలిపారు. త్వరితగతిన ఒక జ్యుడీషియల్ కమిటీ వేసి, ధన్వం తరి ఆస్తులను అమ్మి బాధితులమైన తమకు న్యా యం చేయాలని తీర్పు వెల్లడించిందన్నారు. అసోసియేషన్ నాయకులు ఎ. నరసింహరావు, ప్రసాదరావు, హ నుమ ప్రసాద్, రామాచారి తదితరులున్నారు.