17-12-2025 01:44:56 AM
ముషీరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): దేశంలో అసమానతలతో అభివృద్ధికి దూరంగా ఉన్న 54% జనాభా కలిగిన ఉన్న ఓబీసీల రిజర్వేషన్లు ప్రధాని మోదీ హయాంలోనే సాధించి తీరుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీజేపీ ఎంపీ పాక సత్యనారాయణ అన్నారు. మంగళవారం అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ నాయకత్వంలో ఢిల్లీలోని జం తర్ మంతర్ వద్ద జరిగిన ఓబీసీ మహాధర్నా లో ఎంపీలు ఆర్ కృష్ణయ్య, పాకా సత్యనారాయణ పాల్గొని ప్రసంగించారు.
ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. దేశాన్ని 6 దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సంక్షేమాన్ని, సాధికారతను పూర్తిగా విస్మరించిందన్నారు. దీనివల్ల దేశంలో 54% పైగా ఉన్న ఓ బీసీవర్గాలలో పేదరికం, నిరుద్యోగం తీవరంగా పెరిగిందని, చేతి వృత్తుల, సాంప్రదాయక కులవృత్తులను సైతం కాంగ్రె స్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, దీనివల్ల ఓబీసీ ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో ఓబీసీల అసమానతలను అధిగమించాలంటే కేంద్రంలో ప్రత్యేక మంత్రి త్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ మాట్లాడు తూ.. దేశంలో జరిగే కుల జనగణనలో సమగ్రంగా ఓబీసీల తమ వాస్తవిక సమాచారాన్ని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఓబీసీ ఈ ప్రక్రియను వినియోగించుకో వాలన్నారు.
జనాభా ప్రాతిపదికన ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించారని, శాస్త్రీయ ఆధారాలతో సరైన సమయంలో ఓబీసీ రిజర్వేషన్‌లు అమలు చేస్తారని, అంత్యోదయనే బీజేపీ విధానమని పేర్కొన్నారు. ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. ఏపీలో బిసి స్థానిక సంస్థల లో 34%రిజర్వేషన్లు అమలు చేయాలని దీని కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మహాధర్నాలో ఓబీసీ సంక్షేమ సంఘం జాతీ య కార్యదర్శి డాక్టర్ ఈపన గండ్ల శ్రీనివాస్, కరెన్సీ నోట్‌పై అంబేద్కర్ ఫోటో సాధన సమి తి అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్, ఓబీసీ సంఘం తెలంగాణ, ఏపీ, తమిళనాడు నాయకులు బత్తుల వెంకటేష్ సత్యనారాయణ, పోసి బాబు, లలిత, ఆదిలక్ష్మి, అంకమ్మ, గణపతి, రావూరి కోటేశ్వర రావు, చల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.