calender_icon.png 16 September, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ, విజయదశమి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

16-09-2025 12:39:32 AM

- ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 

కరీంనగర్, సెప్టెంబరు 15 (విజయ క్రాంతి): రాబోవు బతకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని నగరంలో జంక్షన్ లన్ని రంగురంగుల లైట్లతో అలం కరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయిని కలిసి విజయదశమి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్క్ఫెడ్ గ్రౌండ్లో, అంబేద్కర్ స్టేడియంలో గతంలో మాదిరిగా బతుకమ్మ దసరా ఉత్సవాలు చేయుటకు లైటింగ్, సౌండ్ సిస్టం, రామ్ లీలా నిర్వహించుటగాను వైభవంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కరీంనగర్ నగరంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునే ఆనవాయితీ కొన్ని దశాబ్దాల నుండి జరుగుతున్నదని, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఘాట్ల వద్ద సరైన లైటింగ్ సౌకర్యము, బతుకమ్మ ఆడే స్థలాలలో రంగురంగుల ముగ్గులు వేసి అలంకరించాలని, మానేరు రిజర్వాయర్లో బతుకమ్మ నిమజ్జనం చేసే సందర్భంలో సరియైన రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, తదితరులుపాల్గొన్నారు.