05-05-2025 12:27:40 AM
భీమదేవరపల్లి, మే 4 (విజయక్రాంతి) రిజర్వేషన్లు అణిచివేయడమే కాంగ్రెస్ చరిత్ర అని భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బీసీ కులగణన, జనగణన చేసిన సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాలాభిషేకం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ దేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మించిన నాయకుడు లేరన్నారు. మోదీ కేంద్ర క్యాబినెట్‌లో కులగణన, జనగణన చెపెట్టేందుకు ఆమోదం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. 60 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు దేశంలో కులగణన చేపట్టలేదు. బీసీల హక్కులను కాలరాయడం బీసీల హక్కులను అణచివేయడం.
బీసీల రిజర్వేషన్లు అణచివేయడమే కాంగ్రెస్ చరిత్ర!. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో ఉన్న కులాల లెక్కలను జనాభా లెక్కలను తేల్చేందుకు కేంద్ర క్యాబినెట్‌లో కులగణన, జనగణన చేసేందుకు ఆమోదం తెలిపి సంచలన నిర్ణయాలు తీసుకొని 78 ఏండ్ల స్వతంత్ర భారత్‌లో రాజ్యాంగంలో దక్కవలిసిన కులాల ప్రాతిపదికన వాటా అట్టడుగు స్థాయి నోచుకోని అనేక చిరు కులాల గణనను లెక్కించి వారికి దక్కవలిసిన హక్కులను కట్టబెట్టేందుకు తీసుకొన్న చారిత్రాత్మక నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీకి దేశంలోని సబ్బండ వర్గాల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపల్లి పృథ్వీరాజ్, జిల్లా నాయకులు ఊస కోయిల కిషన్ మండల నాయకులు దొంగల వేణు, సిద్ధమల్ల రమేష్, గంప సురేష్. కంకల సదానందం. మహిళా మోర్చా నాయకురాలు అంబిర్ కవిత, ములుగు సంపత్, అయితే సాయి, దొంగల రాణా ప్రతాప్, కాలేరు వికాస్, ముద్దసాని వీరన్న, బొల్లంపల్లి శ్యామ్ గద్ద రాజేందర్, సింగం రాజేందర్, రచ్చ జ్ఞానేశ్వర్, బైక్ అని అఖిల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.