calender_icon.png 25 November, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరాశ్రయులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి

25-11-2025 07:48:40 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.  

మిర్యాలగూడ (విజయక్రాంతి): నిరాశ్రయుల భవనంలో నిరాశ్రయులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ప్రభుత్వ సేవలు వారందరికీ అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రకాష్ నగర్ లో గల నిరాశ్రయుల విశ్రాంతి భవనాన్ని ఆమె మంగళవారం వేకువజాముననే ఆకస్మికంగా తనిఖీ చేసి వారితో ముఖాముఖి మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని గుర్రప్ప గూడానికి చెందిన సైదిరెడ్డి అనే వ్యక్తి యోగక్షేమాలు సమస్యలను అడిగి తెలుసుకోవడంతో ఆశ్రమంలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

నిరాశ్రయుల భవనాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వారి విశ్రాంతి గదిలో శుచితమైన భోజనము ఆరోగ్య పరీక్షలు సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్ నారాయణన్ అమిత్ మాలేపాటి, తహశీల్దార్ శ్రీరాముల సురేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్ఐ కృష్ణయ్య అధికారులు, సిబ్బంది తదితరులున్నారు.