22 April, 2026 | 7:16 PM

Breaking News

గొర్రెల కాపరికి న్యాయం చేసిన పట్టణ సీఐ శివశంకర్   •   వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు   •   గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం   •   జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •   నకిలీ బిల్లులతో రూ.72 లక్షల దుర్వినియోగం   •   బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు కౌన్సిల్‌ తీర్మానం   •  

మేడారంలో వేడినీళ్లు యమా హాట్!

27-12-2025 02:44 AM

బకెట్ ధర రూ. 50 

చలికి గజగజ వణుకుతున్న పిల్లలు, మహిళలు, వృద్ధులు

మేడారం, డిసెంబర్ 26 (విజయక్రాంతి): ఓవైపు గజగజ వణికిస్తున్న చలి.. మరోవైపు జంపన్న వాగులో చన్నీటి స్నానం చేయడానికి ఇబ్బందులు పడే భక్తులకు ఈసారి మేడారంలో వేడినీళ్ల సౌకర్యం కల్పించారు. అయితే హాట్ వాటర్ బకెట్ ధర 50 రూపాయలు నిర్ణయించడంతో కొందరు భక్తులు చేసేదేమీ లేక అంత ధరకు కొనుక్కొని స్నానం చేస్తున్నారు. ముందస్తుగా మేడారం జాతరకు వస్తున్న భక్తుల్లో మహిళలు, వృద్ధులు, చంటి పిల్లలు వేడినీటి స్నానానికి ప్రాధాన్యం ఇస్తుండడంతో కొందరు ఇదే అదునుగా జంపన్న వాగు స్నానఘట్టాల వద్ద ప్రత్యేకంగా పొయ్యిలు ఏర్పాటుచేసి వేడి నీరు కాచి, బకెట్ నీళ్లు 50 రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా మేడారం జాతరలో కొందరికి వేడినీళ్ల విక్రయం కూడా ఈసారి ఒక ఉపాధిగా మారింది.