14-09-2025 01:32:14 AM
పొన్నం సత్తయ్య వర్ధంతి కార్యక్రమంలో మంత్రులు
ఖైరతాబాద్, సెప్టెంబర్ 13 (విజయ క్రాంతి) : పొన్నం సత్తయ్య కుటుంబం నేటి సమాజానికి ఆదర్శం అని మంత్రులు శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు అన్నారు. వివిధ రంగాల్లో సేవలను అందించిన వారిని గుర్తించి ప్రతి ఏటా ’పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం అందజేయడం అభినందనీయమని అన్నా రు. శనివారం పొన్నం సత్తయ్య 15వ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ భాష, సాస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పుర స్కారాలను అందించారు.
ఈ సందర్భంగా పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం25 లను ప్రముఖ నవల రచయిత అంపశయ్య నవీన్, ప్రముఖ గాయని అంతడుపుల రమాదేవికి మంత్రులు అందజేశారు. అనంతరం వీరికి రూ.51వేల చొప్పున నగ దు, మెమోంటో ఇచ్చి, సన్మానించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పొన్నం సత్తయ్య కష్టపడి పనిచేసే తత్వంగల వ్యక్తి అని అన్నారు, క్రమశిక్షణ, నిజాయితీ, విలువలకు ప్రాధాన్యం ఇచ్చేవారని తెలిపారు.
బిసిలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారని, అది చూసేందుకు పొన్నం సత్తయ్య ఉంటే ఆయనెంతో ఆనందపడేవారని తెలిపారు. పొన్నం సత్తయ్య ఆలోచనలు ముం దుకు తీసుకెళ్లేందుకు ముగ్గురు కుమారులు పొన్నం ప్రభాకర్, పొన్నం రవిచంద్ర, పొన్నం అశోక్, అక్కాచెల్లెళ్లు, మనవళ్లు, మనువరాలు కృషిచేస్తున్నారని, వారి ఉమ్మడి కుటుంబం నేటి సమాజానికి ఆదర్శనీయమన్నారు.
మంత్రి తుమ్మల మా ట్లాడుతూ.. పొన్నం సత్తయ్య ఎంతో కాయకష్టం చేసి భూమిని నమ్ముకొని, వ్యవసా యం చేసి, వారి కుమారులను ప్రయోజకులుగా తీర్చిదిద్దారని కొని యాడారు. బిసి వర్గాల్లో వెలుగులు నింపేలా 42శాతం రిజర్వేషన్ల అమలుకు పొన్నం ప్రభాకర్ చేస్తున్న కృషికి తాము అండగా ఉంటామని తెలిపారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఉమ్మ డి కుటుంబ వ్యవస్థ కొనసాగితే సమాజానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పొన్నం సత్తయ్య కుమారులు ప్రయోజకులుకావడమే ఆయన జీవితం సార్ధకత అయిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు జ్ఞానేశ్వర్, చల నరసింహారెడ్డి, జేరిపాటి జెపాల్, ఇనగాల వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంఎల్ ఆరేవలి మోహన్, బిసి సంకేమ శాఖ కమిషనర్, బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.