11-08-2025 12:36:55 AM
పట్టింపులేని నాయకులు నిద్రమత్తులో అధికారులు
పటాన్‌చెరు, ఆగస్టు 10 : ఇంద్రేశం రోడ్డు ప్రయాణీకులను హడలెత్తిస్తోంది. పెద్ద పెద్ద గుంతలతో పూర్తిగా పాడైన రోడ్డుపై తప్పక వెళ్తున్న ప్రయాణీకులు ఒళ్లు హూనం అవు తోంది. మూడు సంవత్సరాలుగా ఈ దారు ణ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణీకులు నడుము నొప్పి, వెన్ను నొప్పి భారిన పడి అవస్థలు పడుతున్నారు. వర్షాలకు గుంతల్లో నీళ్లు నిలవడంతో రోడ్డును వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో బైక్లు అదుపుతప్పి వాహనదా రులు కిందపడుతున్నారు.
ఇటీవల చేపట్టిన మరమత్తు పనులు మున్నాళ్ల ముచ్చటగా మారాయి. వేసిన కంకర అంతా తొలగిపో యింది. నిత్యం వాహనాలతో రద్దిగా ఉండే ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే వాహన దారులు జంకుతున్నారు. తప్పని పరిస్థితు ల్లో కొందరు వాహనదారులు కన్నీళ్లు దిగమింగుతూ వెళ్తున్నారు.
అధిక లోడుతో కంకర టిప్పర్ లు తిరుగుతుండడంతో ఈ రోడ్డు తరుచూ దెబ్బతింటున్నది. ఆర్‌అండ్బీ అధికారులు ఈ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదు. రోడ్డు విస్తరణకు మంజూరైన నిధులు క్యాన్సిల్ అయ్యాయి. రోడ్డును నిర్మించే వరకైన ఆర్‌అండ్బీ అధికారులు మరమత్తులు చేసి అవస్థలు తీర్చాలని ప్రయాణీకులు వేడుకుంటున్నారు.